రాప్తాడు నియోజక వర్గంలో వైసీపీ కార్యకర్తలపై వేట కొడవళ్లతో దాడి!
- నాగసముద్రంలో వైసీపీ కార్యకర్తలపై దాడి
- ఈ దాడి పరిటాల వర్గీయుల పనే అని వైసీపీ ఆరోపణ
- ఎన్ఎస్ గేటు వద్ద వైసీపీ ఆందోళన
ఈ నేపథ్యంలో నిందితులను అరెస్టు చేయాలని కోరుతూ, ఎన్ఎస్ గేటు వద్ద వైసీపీ నాయకులు, కార్యకర్తలు ఆందోళనకు దిగారు. ఎన్నికల్లో టీడీపీకి సహకరించని వారిపై పరిటాల సునీత వర్గీయులు దాడికి పాల్పడ్డారని ఆరోపించారు. నిందితులు ఇద్దరిని వదిలేయాలని ఎస్సై రఫీకి పరిటాల సునీత ఫోన్ చేసి చెప్పడంతో వారిని వదిలేశారని ఆరోపించారు. పరిటాల శ్రీరామ్ చెప్పడంతోనే ఈ దాడులకు పాల్పడ్డామని నిందితులు చెప్పారని వైసీపీ నాయకులు ఆరోపించడం గమనార్హం. పరిటాల శ్రీరామ్ ను అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు. ఈ క్రమంలో పోలీసులకు, వైసీపీ కార్యకర్తలకు మధ్య వాగ్వాదం జరిగింది.