శ్రీదేవి నిర్మాతగా చిరంజీవితో ఒక సినిమా చేయాలనుకున్నారు: యండమూరి
- నిర్మాతగా శ్రీదేవి రంగంలోకి దిగారు
- కోదండరామిరెడ్డి ఆ సినిమాకి దర్శకుడు
- ఒక సాంగ్ చిత్రీకరణ కూడా పూర్తయింది
శ్రీదేవి గారు చిరంజీవి హీరోగా ఒక సినిమా తీయాలనుకున్నారు. కోదండరామిరెడ్డి దర్శకుడు. ఆ సినిమాలో ఆవిడే హీరోయిన్. ఆ సినిమాకి వర్క్ చేస్తూ నేను ఆమె గెస్టు హౌస్ లో ఉండేవాడిని. ఆ సినిమాకి సంగీత దర్శకుడిగా బప్పీలహరిని తీసుకున్నారు. ఒక సాంగ్ చిత్రీకరణ కూడా పూర్తయింది. ఆ తరువాత కథ ఫైనలైజ్ కాకపోవడంతో ఆ సినిమా ఆగిపోయింది. ఆ తరువాతనే 'జగదేకవీరుడు అతిలోక సుందరి' సినిమా వచ్చింది. ఒకటి రెండు సార్లు ఆమెతో మాట్లాడటమే గానీ, అంతకి మించిన పరిచయం లేదు" అని చెప్పుకొచ్చారు.