ఒకరు సుపుత్రుడు, మరొకరు కుపుత్రుడు... కన్నయ్య కుమార్ కోసం ప్రకాశ్ రాజ్ ప్రచారం
- కన్నయ్య కోసం బెగుసరాయి రావడం ఆనందంగా ఉంది
- కన్నయ్య రాకతో 'కాపలాదారులు' ఆందోళన చెందుతున్నారు
- మోదీపై పరోక్ష విమర్శలు
ఈ సందర్భంగా మాట్లాడుతూ, కన్నయ్య కుమార్ కోసం ఇక్కడికి రావడం ఎంతో సంతోషంగా ఉందన్నారు. కన్నయ్య కుమార్ వయసులో తనకంటే చిన్నవాడైనా ఆలోచనల్లో ఎంతో పెద్దవాడని ప్రశంసించారు. ఎన్నికల్లో పోటీ ఇద్దరి మధ్యే ఉందని, ఒకరు సుపుత్రుడు (కన్నయ్య కుమార్), మరొకరు కుపుత్రుడు అంటూ మోదీపై సెటైర్ వేశారు. కన్నయ్య కుమార్ బెగుసరాయి నుంచి పోటీచేస్తున్నా గానీ అతడు యావత్ భారతదేశపు గొంతుక అని అభివర్ణించారు. కన్నయ్య బరిలో దిగడంతో చౌకీదార్లు (కాపలాదారులు) ఆందోళనకు గురవుతున్నారంటూ ప్రకాశ్ రాజ్ ఎద్దేవా చేశారు.