'గ్యాంగ్ లీడర్' కోసం రెడీ అవుతోన్న మేఘా ఆకాశ్
- షూటింగు దశలో 'గ్యాంగ్ లీడర్'
- నాని సరసన నాయికగా మేఘా ఆకాశ్
- ప్రియాంక అరుళ్ తొలి పరిచయం
నితిన్ తో చేసిన రెండు సినిమాలు పరాజయంపాలు కావడంతో వెనుకబడిపోయిన ఈ అమ్మాయి, నాని సినిమాపైనే ఆశలు పెట్టుకుంది. ఈ సినిమా హిట్ అయితే తన కెరియర్ ఊపందుకుంటుందని ఆశపడుతోంది. ఈ సినిమాతో ఈ అమ్మాయి ఆశ నెరవేరుతుందేమో చూడాలి. ఇక ఈ సినిమాలో మరో కథానాయికగా ప్రియాంక అరుళ్ నటిస్తోంది. తెలుగులో ఈ అమ్మాయి తొలి సినిమా ఇదే. 'ఆర్ ఎక్స్ 100' హీరో కార్తికేయ ఈ సినిమాలో విలన్ గా కనిపించనుండటం విశేషం.