త్రివిక్రమ్ - అల్లు అర్జున్ సినిమాలో హన్సిక
- అందాల కథానాయికగా హన్సికకి పేరు
- కీలకమైన పాత్రను ఆఫర్ చేసిన త్రివిక్రమ్
- కెరియర్లో డిఫరెంట్ రోల్ అవుతుందంటూ టాక్
ఈ సినిమాలో ఆమె నెగెటివ్ షేడ్స్ తో కూడిన పాత్రను పోషించనున్నట్టుగా తెలుస్తోంది. త్రివిక్రమ్ ఈ పాత్రను చాలా కొత్తగా .. ఆసక్తికరంగా డిజైన్ చేశాడని అంటున్నారు. ఈ పాత్రలో హన్సికను కొత్తకోణంలో చూపించనున్నట్టు చెబుతున్నారు. హన్సిక కెరియర్లో ఆమె చేసిన విభిన్నమైన పాత్రల్లో ఇది ఒకటి అవుతుందని అంటున్నారు. గతంలో 'దేశముదురు' సినిమాలో అల్లు అర్జున్ సరసన అందాల నాయికగా అలరించిన హన్సిక, ఇప్పుడు ఆయన సినిమాలో నెగెటివ్ షేడ్స్ కలిగిన పాత్ర చేసేందుకు ఒప్పుకోవడం విశేషం.