చిరూ .. అల్లు అర్జున్ సినిమాల్లో అనసూయ
- అనసూయ ప్రధాన పాత్రధారిగా రెండు సినిమాలు
- ఈ ఏడాదిలోనే రానున్న సినిమాలు
- వచ్చే ఏడాది పెద్ద ప్రాజెక్టులు
ఈ సినిమాల తరువాత ఆమె రెండు కొత్త ప్రాజెక్టులను అంగీకరించినట్టుగా తెలుస్తోంది. చిరంజీవితో కొరటాల శివ ఒక సినిమా చేయనున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలో ఒక ముఖ్యమైన పాత్ర కోసం అనసూయను తీసుకున్నట్టుగా సమాచారం. ఇక అల్లు అర్జున్ తో సుకుమార్ ఒక సినిమా చేయనున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలో ఒక కీలకమైన పాత్ర కోసం ఆయన అనసూయను ఎంపిక చేసినట్టుగా చెబుతున్నారు. 'రంగమ్మత్త' స్థాయిలో ఈ పాత్ర ఆమెకు పేరు తీసుకురావడం ఖాయమని అనసూయకి సుకుమార్ చెప్పాడట. మొత్తానికి వచ్చే ఏడాదికి అనసూయ చేతిలో రెండు మంచి ప్రాజెక్టులు ఉన్నట్టే.