దర్శకుడిగా 25 ఏళ్లు పూర్తి చేసుకున్న శంకర్.. దర్శకుల సెలెబ్రేషన్!
- భారీ సినిమాల దర్శకుడిగా శంకర్
- వినోదంతో పాటు సందేశానికి ప్రాధాన్యత
- దర్శకులంతా కలిసి చేసిన సందడి
కథాకథనాల పరంగానే కాకుండా సాంకేతిక పరిజ్ఞానం పరంగా కూడా దక్షిణాది సినిమా స్థాయిని పెంచిన శంకర్, దర్శకుడిగా 25 వసంతాలను పూర్తి చేసుకున్నాడు. ఈ సందర్భంగా తమిళనాట ప్రముఖ దర్శకులంతా, 'రీ యూనియన్ మీట్' పేరుతో శంకర్ ను కలిసి శుభాకాంక్షలు అందజేశారు. బ్లూ అండ్ బ్లూ యూనిఫామ్ లో ఘనంగా సెలబ్రేట్ చేసుకున్నారు. ఈ కార్యక్రమంలో మణిరత్నం వంటి సీనియర్ దర్శకుల నుంచి, అట్లీ కుమార్ వంటి వర్ధమాన దర్శకుల వరకూ పాల్గొనడం విశేషం.