రవితేజ ద్విపాత్రాభినయం .. ఒక పాత్రకు డిజార్డర్
- 'డిస్కోరాజా'గా కనిపించనున్న రవితేజ
- తండ్రీకొడుకులుగా ద్విపాత్రాభినయం
- రవితేజ సరసన ముగ్గురు కథానాయికలు
తండ్రీకొడుకులుగా రెండు విభిన్నమైన పాత్రల్లో ఆయన తెరపై కనిపించనున్నాడు. ఈ రెండు పాత్రల్లో ఒక పాత్రకి విచిత్రమైన ఒక డిజార్డర్ వుంటుందట. కీలకమైన సమయాల్లో ఆ పాత్ర ఒక్కసారిగా బిగుసుకుపోతుందట. ఆ పాత్రకి గల ఆ డిజార్డర్ .. కథ ఎలాంటి మలుపులు తిరగడానికి కారణమవుతుంది? ఎలాంటి పరిణామాలు చోటుచేసుకుంటాయి? అనేది చాలా ఆసక్తికరంగా వుంటుందట. రవితేజ సరసన నాయికలుగా పాయల్ రాజ్ పుత్ .. నభా నటేశ్ .. ప్రియాంక జవాల్కర్ నటిస్తున్నారు.