జమునగారితో ఆ డైలాగ్ చెప్పడానికి భయమేసింది: జయసుధ
- 'పండంటికాపురం'లో అంతా హేమాహేమీలు
- ఫస్టు డైలాగ్ జమునగారితో చెప్పాల్సి వచ్చింది
- జమునగారి కారు చూసి ఆశ్చర్యపోయేదానిని
'పండంటి కాపురం' సినిమా చేసేటప్పటికి నా వయసు 12 సంవత్సరాలే. కృష్ణ .. విజయనిర్మల .. జమున .. బి.సరోజాదేవి .. దేవిక వంటి హేమాహేమీలతో కలిసి నటించవలసి వచ్చింది. మొదటిరోజునే .. మొదటి సీన్ జమునగారితో కలిసి చేయవలసి వచ్చింది. "ఛీ నువ్వసలు తల్లివే కాదు .." అనే డైలాగ్ కోపంతో చెప్పవలసి వచ్చింది. ఆమెతో ఆ డైలాగ్ చెప్పడానికి చాలా భయపడ్డాను. జమున గారు షూటింగుకి చాలా పెద్ద కారులో వచ్చేవారు. అంత పొడవైన కారును చూసి ఆశ్చర్యపోయేదానిని. జమునగారి కారునే ఆ సినిమాలో వాడారు. అలాంటి సినిమాలో నటించిన అనుభవాన్ని ఎప్పటికీ మరిచిపోలేను" అని చెప్పుకొచ్చారు.