సినిమా కబుర్లు.. సంక్షిప్త సమాచారం
- సినిమాల ద్వారా ఎంతో నేర్చుకుందట!
- కేరళ అడవులలో చిరంజీవి షూటింగ్
- తెలుగు డైరెక్టర్ హిందీ చిత్రం
* చిరంజీవి నటిస్తున్న 'సైరా' చిత్రం తాజా షెడ్యూల్ షూటింగ్ ప్రస్తుతం కేరళలోని అడవులలో జరుగుతోంది. చిరంజీవితో పాటు బ్రహ్మాజీ, చరణ్ దీప్ తదితరులు పాల్గొంటున్న ఈ షెడ్యూల్ పది రోజుల పాటు సాగుతుంది.
* ప్రముఖ దర్శకుడు కె.రాఘవేంద్రరావు తనయుడు ప్రకాశ్ కోవెలమూడి రూపొందించిన హిందీ చిత్రం 'మెంటల్ హై క్యా' షూటింగ్ పూర్తయింది. కంగన, రాజ్ కుమార్ రావ్ జంటగా నటించిన ఈ చిత్రాన్ని జూన్ 21న విడుదల చేస్తారు.