ఫ్యామిలీతో విదేశాలకి వెళుతోన్న రవితేజ
- రవితేజను పలకరిస్తోన్న పరాజయాలు
- షూటింగు దశలో 'డిస్కోరాజా'
- త్వరలోనే లైన్లోకి రెండు ప్రాజెక్టులు
తప్పకుండా హిట్ తెచ్చిపెడుతుందనే పూర్తి నమ్మకం కలిగిన కథలకే గ్రీన్ సిగ్నల్ ఇవ్వాలని నిర్ణయించుకున్నాడు. ఈ కారణంగానే ఇప్పుడు ఆయన 'డిస్కో రాజా' సినిమా మాత్రమే చేస్తున్నాడు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగు దశలో వుంది. అయితే ఎండలు విపరీతంగా ఉండటంతో, కొన్ని రోజులు బ్రేక్ తీసుకున్న రవితేజ, ఫ్యామిలీతో విదేశాలకి బయలుదేరుతున్నాడు. వచ్చేనెలలో ఆయన వచ్చాకనే షూటింగు మొదలవుతుందట. అక్కడి నుంచి వచ్చాకనే మరో రెండు ప్రాజెక్టులను లైన్లో పెట్టనున్నాడని అంటున్నారు.