50 రోజుల్లో షూటింగు పూర్తిచేసిన రాజమౌళి తనయుడు
- నిర్మాతగా రాజమౌళి తనయుడు
- దర్శకుడిగా అశ్విన్ గంగరాజు
- సంగీత దర్శకుడిగా కీరవాణి తనయుడు
ఒక కీలకమైన పాత్ర కోసం తమిళ దర్శక నటుడు సముద్రఖనిని తీసుకున్నారు. ఆయా లొకేషన్స్ లో షూటింగును పక్కాగా ప్లాన్ చేసుకుని, 50 రోజుల్లో అంటే సింగిల్ షెడ్యూల్లో షూటింగును ముగించారు. నిన్నటితో ఈ సినిమా షూటింగు పార్టును పూర్తిచేసుకుంది. కీరవాణి తనయుడు కాలభైరవ .. ఈ సినిమాకి సంగీతాన్ని అందించాడు. ఆయన సంగీతం ఈ సినిమాకి ప్రత్యేక ఆకర్షణగా నిలవనుందని అంటున్నారు. త్వరలోనే ఈ సినిమా విడుదల తేదీని ప్రకటించనున్నారు.