మా పాప ఆద్యకి నేను చెప్పేదొక్కటే: రేణు దేశాయ్
- అకీరా తెలుగు బాగా మాట్లాడతాడు
- 'ఆద్య'కి తెలుగు తెలియదు
- మరాఠీ మాట్లాడమని ఆద్యతో చెబుతుంటాను
అందుకు ఆమె స్పందిస్తూ .. "అకీరా హైదరాబాదులో పుట్టిపెరగడం వలన తెలుగు బాగా మాట్లాడతాడు. 'ఆద్య' కూడా హైదరాబాదులోనే పుట్టింది. కాకపోతే .. చిన్నప్పటి నుంచి పూణేలోనే వుంది. అందువలన దానికి తెలుగు తెలియదు .. మరాఠీ వచ్చు. అయితే తాను ఇంగ్లిష్ ఎక్కువగా మాట్లాడుతుంది. నాకు మాతృభాష అంటే ఇష్టం .. అందువలన మరాఠీలో మాట్లాడమని దానికి చెబుతూ వుంటాను. ఒక్క మా అమ్మాయనే కాదు .. ఎక్కడ చూసినా అంతా ఇంగ్లిష్ మాట్లాడుతున్నారు. నేను మాత్రం 'ఆద్య'తో సాధ్యమైనంతవరకూ మాతృభాషలో మాట్లాడించడానికే ప్రయత్నం చేస్తూ వుంటాను" అని చెప్పుకొచ్చారు.