అకీరా ఏ ప్రొఫెషన్ ఎంచుకుంటాడో చూడాలి: రేణు దేశాయ్
- అకీరా క్రికెట్ నేర్చుకున్నాడు
- కొంతకాలం బాస్కెట్ బాల్ పై దృష్టిపెట్టాడు
- ప్రస్తుతం మ్యూజిక్ నేర్చుకుంటున్నాడు
"అకీరా నందన్ ఫలానా ప్రొఫెషన్ లో ఎదగాలనే విషయంలో ఇంకా క్లారిటీ రాలేదు. ఎందుకంటే ప్రతి ఏడాది తన ప్రొఫెషన్ కి సంబంధించిన ఆశయం మారిపోతూ ఉంటుంది. ఒక ఏడాది క్రికెట్ అంటే ఇష్టమని చెప్పేసి క్రికెట్ నేర్చుకున్నాడు. ఆ తరువాత బాస్కెట్ బాల్ పట్ల ఆసక్తితో దానిపై దృష్టి పెట్టాడు. క్రితం ఏడాది .. రైటర్ కావాలనుందని చెప్పాడు .. ఇప్పుడేమో మ్యూజిక్ నేర్చుకుంటానని చెప్పి .. 'లండన్' కాలేజ్ కి పంపించమని అంటున్నాడు. ఆల్రెడీ పియానో నేర్చుకుంటున్నాడు. ఒక తల్లిగా చదువు సంస్కారాల విషయం నేను చూసుకుంటాను. ఇక తాను ఏం కావాలనేది అకీరానే నిర్ణయించుకోవాలి" అని చెప్పుకొచ్చారు.