పవన్ కల్యాణ్ ను ఫస్టుటైమ్ అక్కడే చూశాను :రేణు దేశాయ్
- పూరి జగన్నాథ్ గారు నా ఫొటో చూసి కాల్ చేశారు
- నటన పట్ల నాకు ఆసక్తి ఉండేది కాదు
- దర్శకత్వంపైనే నాకు ఇంట్రెస్ట్ ఉండేది
"నేను మోడలింగ్ చేసే దానిని .. అందుకు సంబంధించిన ఫొటో ఒకటి పూరి జగన్నాథ్ గారి కంటపడింది. దాంతో ఆయన 'బద్రి' సినిమాలో చేయమని అడిగారు. నిజానికి నాకు యాక్టింగ్ అంటే ఇష్టం లేదు .. దర్శకత్వంపైనే ఎక్కువగా ఆసక్తి ఉండేది. పవన్ కల్యాణ్ పేరే నేను అప్పటికి వినలేదు. అందువలన మొదట కుదరదని చెప్పేశాను .. కానీ పూరి గారు ఒప్పించారు. అయితే సినిమా షూటింగుకి ముందు హీరోతో ఒకసారి మాట్లాడాలని చెప్పాను. అలా మొదటిసారిగా 'తమ్ముడు' సినిమా షూటింగు సమయంలో, రామానాయుడు స్టూడియోలో పవన్ కల్యాణ్ ను చూశాను. అక్కడే మా పరిచయం జరిగింది" అని చెప్పుకొచ్చారు.