కండ్లకలకతో బాధపడుతున్న కేటీఆర్.. పార్టీ విస్తృతస్థాయి సమావేశానికి గైర్హాజరు
- కళ్లను పరీక్షించిన వైద్యులు
- నాలుగు రోజులు విశ్రాంతి అవసరమని సలహా
- విశ్రాంతి తీసుకుంటున్న ఫొటోను పోస్టు చేసిన కేటీఆర్
కళ్లను పరీక్షించిన వైద్యులు కండ్లకలక సోకిందని చెప్పి వైద్యం చేశారు. కళ్లు బాగా ఎర్రగా మారి ఇబ్బంది పెడుతుండడంతో నాలుగు రోజులపాటు విశ్రాంతి తీసుకోవాలని సూచించారు. దీంతో అటునుంచి అటే ఇంటికి వెళ్లిన కేటీఆర్ విశ్రాంతి తీసుకుంటున్నారు. ఈ విషయాన్ని అభిమానులతో పంచుకున్న కేటీఆర్.. విశ్రాంతి తీసుకుంటున్న ఫొటోను పోస్టు చేశారు.