నాకు అమ్మాయిల పిచ్చి అంటారు... ఆ మాటను నేను ఎప్పుడూ ఒప్పుకోను: జగపతిబాబు
- రమ్యకృష్ణ చాలా మంచి సలహాలు ఇచ్చేది
- సౌందర్య కల్మషంలేని అమ్మాయి
- స్త్రీలోలుడు అంటే వేరే అర్థం వస్తుంది
ఆమని, కల్యాణి, ప్రియమణి కూడా తనతో అనేక చిత్రాల్లో నటించారని, ఆమని ఓ నటిగా ఎంతో గొప్పదని అన్నారు. ఆమెతో నటించిన శుభలగ్నం చిత్రం తన కెరీర్ లో మంచి సినిమాగా నిలిచిపోతుందని, అందులో ఆమని నటన అద్భుతం అని పేర్కొన్నారు. అయితే, ఇండస్ట్రీలో తన గురించి ఉన్న అపోహ గురించి జగపతిబాబు ఈ సందర్భంగా ప్రస్తావించారు.
అందరూ తనను ఉద్దేశించి 'స్త్రీలోలుడు' అని భావిస్తారని, అది సరికాదని, ఆ మాటంటే తాను ఎప్పుడూ ఒప్పుకోనని స్పష్టం చేశారు. అమ్మాయిల పిచ్చి అంటే అది వేరే అర్థం వస్తుందని, చాలామంది దాని అర్థం తెలియకుండా వాడుతుంటారని జగపతిబాబు తెలిపారు. సరసానికి, అమ్మాయిల పిచ్చికి, ప్రేమకి చాలా తేడా ఉందని అన్నారు. తాను తల్లి నుంచి ప్రతి స్త్రీని ప్రేమిస్తానని, అందుకే స్త్రీలను ప్రేమిస్తుంటానని ఎప్పుడూ చెబుతుంటానని జగపతిబాబు వివరించారు.