అంతకుముందు సద్ది అన్నం తినేవాడ్ని, ఇప్పుడు గంజినీళ్లు తాగుతున్నా: జగపతిబాబు
- మాంసాహారం దాదాపు మానేశా
- నా శరీరానికి పడే ఆహారమే తింటా
- ధ్యానంతో మొదలుపెట్టి యోగా వైపు వచ్చాను
ప్రతిరోజూ రెండు గంటల పాటు యోగా చేస్తానని, ధ్యానం కూడా చేస్తానని వెల్లడించారు. మొదట ధ్యానంతో మొదలుపెట్టానని, ఆ తర్వాత క్రమంగా యోగా వైపు మళ్లానని తెలిపారు. తనకు యోగా అన్నా, ఆయుర్వేదం అన్నా ఎంతో నమ్మకం ఉందని జగపతిబాబు చెప్పారు.
ఇక ఆహారం విషయానికొస్తే తన శరీరానికి ఇబ్బంది కలిగించని ఆహారం మాత్రమే తీసుకుంటానని, గతంలో ప్రతిరోజూ ఉదయం సద్ది అన్నం తినేవాడ్నని, ఇప్పుడు గంజినీళ్లు తాగుతున్నానని వివరించారు. వాటితో పాటు అల్లం రసం, కొబ్బరినీళ్లు తాగుతానని చెప్పారు. ఒకప్పుడు మాంసాహారం బాగా తినేవాడ్నని, ఇప్పుడు ఆరోగ్యరీత్యా దాదాపు దూరంగా ఉన్నానని జగపతిబాబు వెల్లడించారు.