'వ్యూహం' సినిమాలో నాని హీరో కాదట!
- ఇంద్రగంటి మోహనకృష్ణ నుంచి మరో ప్రాజెక్టు
- హీరోగా సుధీర్ బాబు
- కీలకమైన పాత్రలో నాని
అయితే ఈ సినిమాలో నాని కొంతసేపు మాత్రమే కనిపిస్తాడని తెలుస్తోంది. సినిమా మొత్తం మీద ఆయన పాత్ర 15 నుంచి 20 నిమిషాల మధ్య మాత్రమే ఉంటుందని అంటున్నారు. 'ఎవడు' సినిమాలో బన్నీ పాత్ర మాదిరిగా 'వ్యూహం' సినిమాలో నాని పాత్ర కీలకంగా నిలుస్తుందేగానీ హీరోగా మాత్రం కాదట. ఆ సినిమా మాదిరిగానే ఇది కూడా మల్టీస్టారర్ మూవీ కాదనేది స్పష్టం. దిల్ రాజుతో పాటు నాని కూడా ఈ సినిమాకి నిర్మాతగా వ్యవహరించనున్నాడనే ఒక టాక్ మాత్రం వినిపిస్తోంది.