ఆసక్తిని రేపుతోన్న 'అభినేత్రి 2' ఫస్టులుక్
- తెరపైకి 'అభినేత్రి' సీక్వెల్
- డిఫరెంట్ లుక్స్ తో ప్రభుదేవా
- ప్రత్యేక పాత్రలో నందితా శ్వేత
ప్రధాన పాత్రధారులైన ప్రభుదేవా .. తమన్నా .. నందితా శ్వేతలపై ఆవిష్కరించిన ఫస్టులుక్ ఆసక్తిని రేకెత్తించేదిలా వుంది. 'అభినేత్రి'లో తమన్నా పల్లెటూరి అమ్మాయిగాను .. మోడ్రన్ అమ్మాయిగాను డిఫరెంట్ లుక్స్ తో కనిపించి మెప్పించింది. 'అభినేత్రి 2' మాత్రం ప్రభుదేవా డిఫరెంట్ లుక్స్ తో కనిపించనున్నట్టు చెబుతున్నారు. ఇక నందితా శ్వేత పాత్ర ప్రధాన ఆకర్షణ అవుతుందనే చెప్పాలి. దర్శకుడు ఎ.ఎల్. విజయ్ ఈ సీక్వెల్ తోను హిట్ కొడతాడనే టాక్ కోలీవుడ్లో వినిపిస్తోంది.