టీఆర్ఎస్ అభ్యర్థి బీబీ పాటిల్ ప్రభుత్వానికి కట్టాల్సిన పన్నును ఎగవేశారు: షబ్బీర్ అలీ ధ్వజం
- 3 కేసులు నమోదైనా తెలియనివ్వట్లేదు
- గజమాలతో ఎందుకు సన్మానించారు?
- నిధులను తిరిగి పంపించినందుకా?
- క్రిమినల్ కేసులు ఉన్నందుకా?
నిన్న బీబీ పాటిల్ కామారెడ్డికి వస్తే క్రేన్ ద్వారా గజమాలతో సన్మానించారని, అసలా గజమాలను ఎందుకు వేశారో చెప్పాలని షబ్బీర్ అలీ డిమాండ్ చేశారు. మొట్ట మొదటి సారి కామారెడ్డి వచ్చినందుకు గజమాల వేశారా? కేంద్రం నుంచి వచ్చిన నిధులను ఖర్చు పెట్టకుండా తిరిగి పంపించినందుకా? లేదంటే క్రిమినల్ కేసులు ఉన్నందుకు వేశారా? అని ప్రశ్నల వర్షం కురిపించారు. నెల రోజుల క్రితం పాటిల్ ను ఎంపీగా వద్దన్న ఎమ్మెల్యేలను కేసీఆర్ ఏం చేశారో ఏమో కానీ, 15 రోజుల్లో మారిపోయి శభాష్ పాటిల్ అంటున్నారని, దీనిలోని ఆంతర్యమేంటో అర్థం కావట్లేదన్నారు.