ధనుష్... భారత సైన్యంలో ప్రవేశించిన సరికొత్త అస్త్రం!
- స్వదేశంలో తయారైన శతఘ్ని
- మొత్తం 11 నమూనాల పరీక్ష
- ప్రపంచంలో అత్యంత కచ్చితత్వంతో లక్ష్యం ఛేదించే శతఘ్నిగా గుర్తింపు
ఈ శతఘ్నికి 38 కిలోమీటర్ల దూరంలోని లక్ష్యాలను గురితప్పకుండా ఛేదించే సత్తా ఉంది. ప్రపంచంలోనే అత్యంత కచ్చితత్వంలో లక్ష్యాన్ని ఛేదించే ఆర్టిలరీ గన్ గా గుర్తింపు సంపాదించుకుంది. ఒక్కో ధనుష్ శతఘ్ని తయారీ ఖర్చు రూ.14.50 కోట్లు కాగా, దీన్లో ఉపయోగించే ఒక్కో షెల్ ఖరీదు లక్ష రూపాయల పైచిలుకే. రాత్రివేళల్లో సైతం దీంతో శత్రువులపై దాడి చేసే వీలుంటుంది.