తేజు సెంటిమెంట్ కోసం అంత ఖర్చు చేశారట
- అందమైన ప్రేమకథగా 'చిత్రలహరి'
- ఈ నెల 12వ తేదీన భారీ విడుదల
- సాయితేజ్ ఆశలన్నీ ఈ సినిమాపైనే
అయితే సాయితేజ్ మాత్రం శిల్పకళా వేదికలోనే ఈ సినిమా ఆడియో వేడుక జరపమని రిక్వెస్ట్ చేశాడట. అక్కడ ఆడియో వేడుక జరుపుకున్న తన సినిమాలు సక్సెస్ అయ్యాయనీ .. అది తన సెంటిమెంట్ అంటూ ఒక తీరుగా చెప్పాడట. దాంతో మైత్రీ మూవీ మేకర్స్ వారు అందుకు అంగీకరించి, ఈ వేడుకను శిల్పకళా వేదికలోనే నిర్వహించారు. ఈ వేడుకను ఇక్కడ జరపడం వలన, నిర్మాతలకి అదనంగా 9 లక్షలు ఖర్చు అయిందని చెప్పుకుంటున్నారు. ఈ సినిమా సక్సెస్ కోసమే సాయితేజ్ వేయికళ్లతో వెయిట్ చేస్తున్నాడు.