'ఐకాన్'గా బన్నీ.. దిల్ రాజు నిర్మాత, శ్రీరామ్ వేణు దర్శకత్వం!
- ఇటీవలే త్రివిక్రమ్ దర్శకత్వంలో సినిమా మొదలు
- నేడు పుట్టిన రోజు సందర్భంగా మరో చిత్రంపై ప్రకటన
- 'ఐకాన్ - కనబడుటలేదు' అన్న టైటిల్
'ఎంసీఏ'తో హిట్ కొట్టిన శ్రీరామ్ వేణు దర్శకత్వంలో, దిల్ రాజు నిర్మాతగా బన్నీ మరో చిత్రాన్ని చేయనున్నాడు. ఈ సినిమాకు 'ఐకాన్ - కనబడుటలేదు' అన్న ఆసక్తికర టైటిల్ ను పెట్టి, టైటిల్ పోస్టర్ ను విడుదల చేశారు. దీంతో అధికారికంగా బన్నీ ఈ సంవత్సరం రెండు సినిమాలను ప్రకటించినట్టు. ఈ కొత్త టైటిల్ రివీల్ తో అల్లు అర్జున్ అభిమానులు ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు.