గాయాల నుంచి కోలుకుని షూటింగుకి సిద్ధమవుతోన్న గోపీచంద్
- అనిల్ సుంకర నిర్మాణంలో యాక్షన్ ఎంటర్టైనర్
- తిరు దర్శకత్వంలో గోపీచంద్
- తదుపరి షెడ్యూల్ కి సన్నాహాలు
అనిల్ సుంకర నిర్మాతగా ఈ సినిమా సెట్స్ పైకి వెళ్లింది. కొన్ని రోజుల క్రితం యాక్షన్ సన్నివేశాలను చిత్రీకరిస్తూ ఉండగా గోపీచంద్ గాయపడ్డాడు. ఈ కారణంగా ఆ షెడ్యూల్ షూటింగును ఆపేశారు. ఆ గాయాలు నయమై గోపీచంద్ కోలుకున్నాడనేది తాజా సమాచారం. ఈ సినిమా షూటింగులో తిరిగి పాల్గొనేందుకు గోపీచంద్ సిద్ధమవుతున్నాడట. డిఫరెంట్ లుక్ తో గోపీచంద్ కనిపించనున్న ఈ సినిమా, ఆయనకి హిట్ తెచ్చిపెడుతుందేమో చూడాలి.