'కేసరి'తో వరుసగా 11వ సారి 100 కోట్ల క్లబ్ లో చేరిన అక్షయ్
- వైవిధ్యభరితమైన కథలకు ప్రాధాన్యత
- విభిన్నమైన పాత్రలపట్ల ఆసక్తి
- సొంతమవుతోన్న వరుస విజయాలు
ఈ నేపథ్యంలో తాజాగా ఆయన చేసిన 'కేసరి' సినిమా .. ఈ నెల 21వ తేదీన ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలోకి వచ్చింది. విడుదలైన అన్ని ప్రాంతాల్లో భారీ వసూళ్లతో ఈ సినిమా దూసుకుపోతోంది. 7 రోజుల్లోనే ఈ సినిమా 100 కోట్ల క్లబ్ లోకి చేరిపోయింది. ఇంతవరకూ అక్షయ్ కుమార్ చేసిన సినిమాల్లో, 100 కోట్ల క్లబ్ లోకి చేరిన 11వ సినిమా ఇది. ఈ ఏడాది చాలా తక్కువ సమయంలో 100 కోట్ల క్లబ్ లోకి చేరిన చిత్రంగా ఇది సరికొత్త రికార్డును సొంతం చేసుకోవడం విశేషం.