సరదా, సంతోషాలను కోరుకునే అమ్మాయే 'సూర్యకాంతం': నిహారిక
- ప్రణీత్ దర్శకత్వంలో 'సూర్యకాంతం'
- అందంగా .. అల్లరిగా సాగే ప్రేమకథ
- రేపే ప్రేక్షకుల ముందుకు
తాజా ఇంటర్వ్యూలో ఆమె మాట్లాడుతూ .. "ఈ సినిమాలో నా పాత్ర పేరు 'సూర్యకాంతం'. కథ అంతా కూడా నా పాత్ర చుట్టూనే తిరుగుతుంది గనుక, ఈ సినిమాకి 'ఈ టైటిల్ పెట్టారు. సరదాగా సాగిపోయే ఈ ప్రేమకథలో .. ఎప్పుడూ సంతోషంగా .. స్వేచ్ఛగా ఉండటానికి ఇష్టపడే పాత్రలో నేను కనిపిస్తాను. నా పాత్ర యూత్ కి బాగా కనెక్ట్ అవుతుందని భావిస్తున్నాను. యూత్ తో పాటు ఫ్యామిలీ ఆడియన్స్ కి కూడా ఈ సినిమా బాగా నచ్చుతుందనే నమ్మకం వుంది" అంటూ చెప్పుకొచ్చింది.