'మిడిల్ క్లాస్ అబ్బాయి' దర్శకుడితో అల్లు అర్జున్
- త్రివిక్రమ్ తో సెట్స్ పైకి బన్నీ
- తదుపరి సినిమా సుకుమార్ తో
- లైన్లోకి వచ్చిన వేణు శ్రీరామ్
ఈ సినిమా తరువాత సుకుమార్ దర్శకత్వంలో అల్లు అర్జున్ సినిమా వుండనుంది. ఈ ప్రాజెక్టు తరువాత ఆయన వేణు శ్రీరామ్ దర్శకత్వంలో ఒక సినిమా చేయడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టుగా తెలుస్తోంది. 'మిడిల్ క్లాస్ అబ్బాయి'తో దర్శకుడిగా తన సత్తా చాటుకున్న వేణు శ్రీరామ్, ఏడాది పాటు ఈ కథపై కసరత్తు చేసి అల్లు అర్జున్ కి వినిపించాడట. ఆయనకి ఈ కథ బాగా నచ్చడంతో, పూర్తి స్క్రిప్ట్ సిద్ధం చేయమని చెప్పినట్టుగా సమాచారం. ఈ సినిమాకి దిల్ రాజు నిర్మాతగా వ్యవహరిస్తాడట.