విజయ్ దేవరకొండకి గట్టి పోటీ ఇస్తోన్న సూర్య
- భరత్ కమ్మ నుంచి 'డియర్ కామ్రేడ్'
- మే 31వ తేదీన భారీ విడుదల
- అదే రోజున రానున్న సూర్య మూవీ
పెద్ద సినిమాలేవీ దగ్గరలో లేకపోవడం .. 'డియర్ కామ్రేడ్'కి కలిసొచ్చే అంశమని అనుకున్నారు. అయితే అనుకోకుండా 'ఎన్జీకే' వచ్చి ఇదే డేట్ ను ఫిక్స్ చేసుకుంది. సెల్వ రాఘవన్ దర్శకత్వం వహించిన ఈ సినిమా కొన్ని కారణాల వలన వాయిదా పడుతూ వచ్చి, ఈ తేదీని ఖరారు చేసుకుంది. తమిళనాట సూర్యకి గల క్రేజ్ గురించి తెలిసిందే. అందువలన విజయ్ దేవరకొండ 'డియర్ కామ్రేడ్' కి ఈ సినిమా గట్టిపోటీ ఇవ్వడం ఖాయమనే టాక్ బలంగా వినిపిస్తోంది. ఈ పోటీని విజయ్ దేవరకొండ ఎలా తట్టుకుంటాడో చూడాలి మరి.