నేను ఎన్టీఆర్ అభిమానినని తెలిసి జంధ్యాలగారు అలా చేశారు: సీనియర్ నటుడు ప్రదీప్
- జంధ్యాలగారు మా ఇంటికి భోజనానికి వచ్చారు
- ఎన్టీఆర్ అంటే నాకెంత ఇష్టమో గ్రహించారు
- నాతో చెప్పిన మాటను నిజం చేశారు
ఒక రోజున జంధ్యాల గారు మా ఇంటికి భోజనానికి వచ్చారు. నాకు ఎన్టీఆర్ అంటే ఇష్టమనే సంగతి ఆ సమయంలోనే జంధ్యాలగారికి తెలిసింది. 'నిన్ను హీరోగా పెట్టి ఒక సినిమా తీస్తాను .. ఆ సినిమా ప్రివ్యూకి ఎన్టీఆర్ గారిని పిలుస్తాను' అని ఆయన నాతో అన్నారు. ఆ తరువాత కొంతకాలానికి ఆయన నాతో 'ముద్దమందారం' సినిమా తీశారు. ఆ సినిమా ప్రివ్యూకి ఎన్టీఆర్ గారిని పిలిచారు. ఎన్టీఆర్ గారితో కలిసి ప్రివ్యూ చూడటం .. ఆయన అభినందనలు అందుకోవడం .. జంధ్యాల గారు ఎప్పుడో అన్నమాటను నిజం చేయడం ఎప్పటికీ మరిచిపోలేను" అని చెప్పుకొచ్చారు.