చిత్రపరిశ్రమలో నేను ఇమడలేకపోయాను: సీనియర్ నటుడు ప్రదీప్
- అందువల్లనే గ్యాప్ తీసుకున్నాను
- జంధ్యాలగారు నచ్చజెప్పారు
- అప్పుడంత మెచ్యూరిటీ లేదు
"నా మనస్తత్వానికి .. చిత్రపరిశ్రమలోని వాతావరణానికి పొంతన కుదరలేదు. నేను ముక్కుసూటిగా వెళతాను .. చాలా సెన్సిటివ్ గా వుంటాను. ఎవరైనా ఒక్కమాట అంటే తట్టుకోలేను. ఈ కారణంగానే ఇండస్ట్రీ నుంచి నేను కొంతకాలం పాటు గ్యాప్ తీసుకున్నాను. ఈ విషయంలో నేను ఎవరిదీ తప్పని చెప్పడం లేదు .. అక్కడి పరిస్థితులకు నేను ఇమడలేకపోయాను. జంధ్యాల గారు నాకు నచ్చజెప్పడానికి ప్రయత్నించినా నేను వినిపించుకోలేదు. ఇప్పుడున్న మెచ్యూరిటీ అప్పుడుంటే నేను ఎక్కడో వుండేవాడినని మాత్రం అనిపిస్తూ ఉంటుంది" అని అన్నారు.