ఇష్టం లేకపోతే ఆయనను చంపేయండి.. దరిద్రం వదిలిపోతుంది: శివాజీ
- మీకు అనుకూలమైన ప్రభుత్వం రావాలనే ఇదంతా చేస్తున్నారు
- రానున్న 15 రోజులు రాష్ట్రంలో దారుణ పరిస్థితులు ఉంటాయి
- ఏపీకి ఏమీ చేయకపోగా.. కుట్రలకు పాల్పడుతున్నారు
రాష్ట్రానికి ఇవ్వాల్సిన నిధులు ఇవ్వకుండా, హామీలు నెరవేర్చకుండా... హైదరాబాదు కేంద్రంగా రాజకీయాలను చేస్తున్నారని శివాజీ మండిపడ్డారు. హైదరాబాదులో ఆస్తులు ఉన్నవారిని బెదిరిస్తున్నారని... కులాల మధ్య చిచ్చు పెడుతున్నారని విమర్శించారు. హైదరాబాదులో ఉన్న ఆస్తులను చట్టపరంగా ఏపీ ప్రభుత్వానికి ఇంతవరకు పంచలేదని దుయ్యబట్టారు. ఏపీకి ఏమీ చేయకపోగా... కుట్రలకు పాల్పడుతున్నారని మండిపడ్డారు.