ఉత్కంఠను రేపుతోన్న అంజలి హారర్ మూవీ టీజర్
- అంజలి ప్రధాన పాత్రధారిగా 'లిసా'
- హారర్ నేపథ్యంలో సాగే కథ
- త్వరలోనే ప్రేక్షకుల ముందుకు
ఒక ఇంట్లో అంజలికి ఎదురయ్యే భయానక సంఘటనలపై కట్ చేసిన ఈ టీజర్, ఈ సినిమాపై ఆసక్తిని పెంచేదిలా వుంది. హారర్ థ్రిల్లర్ సినిమాలు చేయడం అంజలికి కొత్తేమి కాదు. గతంలో తాను చేసిన ఈ తరహా సినిమాలకి మంచి రెస్పాన్స్ వచ్చింది. అందువలన సహజంగానే ఈ సినిమాపై అందరిలోను ఆసక్తి వుంది. రాజు విశ్వనాథ్ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో, బ్రహ్మానందం .. యోగిబాబు ముఖ్యమైన పాత్రల్లో కనిపించనున్నారు. త్వరలోనే ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది