జనసేన ఆఫీసులో క్లీనింగ్ చేసేందుకు కూడా రెడీ అని చెప్పా.. కానీ పవన్ గొప్ప గౌరవం ఇచ్చారు!: నాగబాబు
- పవన్ కల్యాణ్ పేరుకే నాకు తమ్ముడు
- నిజానికి ఆయన నాకు నాయకుడు
- పవన్ స్ఫూర్తితోనే ఇటీవల మాట్లాడాను
పవన్ కల్యాణ్ పేరుకే తనకు తమ్ముడనీ, నిజానికి సాధారణ జనసేన కార్యకర్తల్లాగే తనకూ పవన్ నాయకుడని వ్యాఖ్యానించారు. పార్టీలో చేరకముందే ఎలాంటి బాధ్యత అప్పగించినా అంకితభావంతో పనిచేసేందుకు సిద్ధమయ్యానని తెలిపారు. జనసేన కార్యాలయంలో తనకు క్లీనింగ్ పని ఇచ్చినా చేసేందుకు రెడీ అని చెప్పానన్నారు.
కానీ తనను నరసాపురం లోక్ సభ అభ్యర్థిగా నిలబెట్టి పవన్ గొప్ప గౌరవం ఇచ్చారన్నారు. పవన్ కల్యాణ్ ఇచ్చిన స్ఫూర్తి, బలం, ధైర్యంతోనే ఇటీవల తాను మాట్లాడానని స్పష్టం చేశారు. తనకు ఈ అవకాశం ఇచ్చినందుకు పవన్ కల్యాణ్ కు నాగబాబు కృతజ్ఞతలు చెప్పారు.