కార్తికేయ 'హిప్పీ' మూవీ నుంచి టీజర్ వచ్చేస్తోంది
- ద్విభాషా చిత్రంగా 'హిప్పీ'
- నాయికగా దిగాంగన
- దర్శకుడిగా కృష్ణ పరిచయం
తమిళ .. తెలుగు భాషల్లో ఈ సినిమా రూపొందుతోంది. ఈ నెల 20వ తేదీన ఈ సినిమా నుంచి ఫస్టు టీజర్ ను వదలనున్నారు. టీజర్ తోనే సినిమాపై అంచనాలు పెంచే పనిలో వున్నారు. కలైపులి థాను నిర్మిస్తోన్న ఈ సినిమాకి ఎన్.కృష్ణ దర్శకత్వం వహిస్తున్నాడు. కథానాయికగా ఈ సినిమాతో 'దిగాంగన' పరిచయమవుతోంది. ఇప్పటికే ఈ సినిమా చిత్రీకరణ చాలా వరకూ పూర్తయింది. నివాస్ కె. ప్రసన్న అందించిన సంగీతం, ఈ సినిమాకి ప్రత్యేక ఆకర్షణ అవుతుందని అంటున్నారు.