రేపు రిలీజ్ కానున్న 'డియర్ కామ్రేడ్' టీజర్
- స్టూడెంట్ లీడర్ గా విజయ్ దేవరకొండ
- క్రికెటర్ గా రష్మిక మందన
- మే చివరివారంలో విడుదల
ఈ సినిమా నుంచి టీజర్ ఎప్పుడు వస్తుందా అని విజయ్ దేవరకొండ అభిమానులంతా ఎంతో ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు. రేపు (మార్చి 17) ఉదయం 11గంటల 11 నిమిషాలకి ఈ సినిమా నుంచి టీజర్ వదలడానికి ముహూర్తాన్ని ఖరారు చేశారు. తెలుగుతో పాటు తమిళ.. మలయాళ .. కన్నడ భాషల్లోను ఈ సినిమాను విడుదల చేయాలనే ఆలోచనలో వున్నారు. అందువలన ఆ భాషల్లోను టీజర్ ను విడుదల చేస్తున్నారు. మే చివరివారంలో ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.