సినిమా కబుర్లు.. సంక్షిప్త సమాచారం
- రవితేజ సరసన కేథరిన్
- హైకోర్టులో చిన్మయికి ఊరట
- వెండితెరకు వస్తున్న కొత్తజంట
* ప్రముఖ గాయని చిన్మయి శ్రీపాదపై తమిళనాడు డబ్బింగ్ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ విధించిన నిషేధంపై మద్రాస్ హైకోర్టు స్టే విధించింది. గతేడాది డబ్బింగ్ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ అధ్యక్షుడు, నటుడు రాధారవిపై చిన్మయి లైంగిక ఆరోపణలు చేయడంతో ఆమెపై నిషేధం విధించారు.
* తమిళ నటుడు ఆర్య, కథానాయిక సాయేశా సైగల్ ఇటీవల పెళ్లి చేసుకున్న సంగతి విదితమే. పెళ్లి తర్వాత ఈ జంట వెండితెరపై మరోసారి జంటగా కనిపించనుంది. 'టెడ్డీ' చిత్రంలో ఆర్యకు జంటగా తాజాగా సాయేశాను ఎంపిక చేశారు. వీరిద్దరూ కలిసి నటించే మూడో చిత్రం ఇది.