Rakul Preeth: బాగా చిక్కిన రకుల్.. ఆశ్చర్యపోతున్న నెటిజన్లు

  • ఫిజిక్‌పై దృష్టి పెట్టిన రకుల్
  • సైజ్ జీరో కోసం కఠోర శ్రమ
  • నలుపు రంగు బికినీలో ఫోటోలకు ఫోజు

అవకాశాలు తగ్గిపోతున్నాయనో ఏమో కానీ రకుల్ ఫిజిక్‌పై దృష్టి పెట్టింది. ఇటీవల తెరపై కాస్త బొద్దుగా కనిపించిన ఈ ముద్దుగుమ్మ మళ్లీ సైజ్ జీరో కోసం విపరీతంగా శ్రమించింది. దీంతో సైజ్ జీరో మాటేమో కానీ మైనస్ జీరోకి వెళ్లిపోయింది. ఈ ముద్దుగుమ్మ ఫోటోలను సోషల్ మీడియాలో చూసిన నెటిజన్లంతా నోరెళ్లబెడుతున్నారు.

ప్రస్తుతం సింగపూర్ వెకేషన్‌లో ఉన్న రకుల్.. నలుపురంగు బికినీ ధరించి ఫోటో దిగి దానిని సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. అయితే రకుల్‌ను అలా చూసిన నెటిజన్లు మాత్రం కాస్తంత బొద్దుగా ఉంటేనే రకుల్ బాగుంటుందని అభిప్రాయపడుతున్నారు. జిమ్ముల్లో తెగ కష్టపడి.. బాగా స్లిమ్ అయిపోయిన ఈ బ్యూటీని అవకాశాలు ఏమేరకు వరిస్తాయో వేచి చూడాలి.

Rakul Preeth
Singapore
Vacation
Black Colour
Bikini
Size Zero
  • Loading...

More Telugu News