నాకు, నాగబాబుకు మధ్య చిచ్చుపెట్టారు: సినీ హాస్య నటుడు పృథ్వీ
- 2009 నుంచి నాగబాబు తెలుసు
- జనసేన నిధులపై ఎన్నడూ మాట్లాడలేదు
- నాగబాబుకు వివరణ ఇచ్చానన్న పృథ్వీ
జనసేనకు వస్తున్న నిధుల గురించి తాను ఎన్నడూ ఎటువంటి వ్యాఖ్యలూ చేయలేదని స్పష్టం చేశారు. తాను రాయదుర్గంలో ఉన్న వేళ, నాగబాబు ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్నారని, ఆ సమయంలో యాంకర్ అడిగిన ప్రశ్నపై స్పందిస్తూ, తనను ఫోన్ చేయమని నాగబాబు చేసిన వ్యాఖ్యలను టీవీలో చూశానని అన్నారు. ఆ వెంటనే రాత్రి 11 గంటలకు ఫోన్ చేశానని చెప్పారు. తానిచ్చిన సమాధానంతో నాగబాబు సంతృప్తి చెందారని అన్నారు. ఆ యాంకర్ అలా ఎందుకు చెప్పిందో తనకు తెలియదని అన్న పృథ్వీ, తనకు నాగబాబుకూ మధ్య కొందరు చిచ్చు పెట్టారని విమర్శించారు.