వచ్చేనెల నుంచి సెట్స్ పైకి నిఖిల్ - నివేదల 'శ్వాస'
- వైవిధ్యభరితమైన చిత్రంగా 'శ్వాస'
- సాఫ్ట్ వేర్ ఇంజనీర్ గా నిఖిల్
- కథానాయికగా నివేదా థామస్
ఈ సినిమాలో నిఖిల్ సాఫ్ట్ వేర్ ఇంజనీర్ గా కనిపించనున్నాడని అంటున్నారు. పూర్తిగా ట్రావెల్ బేస్డ్ సినిమా ఇది. అందువలన ఇంతకుముందు తెరపై కనిపించని లొకేషన్స్ లో ఈ సినిమా షూటింగు జరిగేలా ప్లాన్ చేస్తున్నట్టుగా సమాచారం. రెడ్ స్కై ఎంటర్టైన్మెంట్ బ్యానర్ పై .. వచ్చేనెల నుంచి రెగ్యులర్ షూటింగ్ మొదలుపెట్టడానికి సన్నాహాలు చేస్తున్నారు. తన కెరియర్లో వైవిధ్యభరితమైనదిగా ఈ సినిమా నిలిచిపోతుందనే నమ్మకంతో నిఖిల్ వున్నాడని అంటున్నారు.