అవసరాల స్టైల్లోనే నాగశౌర్య కొత్త సినిమా టైటిల్
- దర్శకుడిగా అవసరాల నుంచి మరో మూవీ
- నాగశౌర్య జోడీగా మాళవిక నాయర్
- త్వరలోనే సెట్స్ పైకి వెళ్లే దిశగా పనులు
కథాకథనాలను బట్టి ఈ సినిమాకి 'ఫలానా అబ్బాయి .. ఫలానా అమ్మాయి' అనే టైటిల్ ను సెట్ చేసుకున్నట్టుగా తెలుస్తోంది. దాదాపుగా ఈ టైటిల్ ఓకే అయిపోయినట్టేనని అంటున్నారు. గతంలో అవసరాల .. నాగశౌర్య కాంబినేషన్లో 'ఊహలు గుసగుసలాడే'.. 'జ్యో అచ్యుతానంద' సినిమాలు విజయాలను అందుకున్నాయి. ఈ సినిమాతో ఈ ఇద్దరికీ హ్యాట్రిక్ హిట్ దొరుకుతుందేమో చూడాలి.