కోలీవుడ్ లో వివాదం... మద్యం మత్తులో మరో నటుడిని కొట్టిన విమల్!
- విరుగంబాక్కంలో ఘటన
- మద్యం తాగి వచ్చిన విమల్, అతని స్నేహితులు
- మరో నటుడు అభిషేక్ పై దాడి
ఆపై ఇక్కడ కాసేపు కూర్చోవచ్చా? అని అభిషేక్ ను ప్రశ్నించగా, భవనం యజమానిని తాను కాదని, తనకు సంబంధం లేదని చెప్పాడు. ఈ క్రమంలో వారిద్దరి మధ్యా వాగ్వాదం జరుగగా, విమల్ తన అనుచరులతో కలిసి అభిషేక్ పై దాడి చేశాడు. దీంతో గాయాలపాలైన అభిషేక్ వడపళని ప్రాంతంలోని ఓ ఆసుపత్రిలో చికిత్స పొంది, విమల్ పై పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కేసును విచారిస్తున్నామని, విమల్ ను ప్రశ్నించాల్సివుందని పోలీసులు తెలిపారు.