ఒక సీన్ కోసం 37 టేకులు తీసుకున్న రమ్యకృష్ణ!
- పోర్న్ స్టార్ పాత్రలో రమ్యకృష్ణ
- ప్యాషన్ తో చేసిన పాత్ర ఇది
- మార్చి 29వ తేదీన విడుదల
నటిగా అపారమైన అనుభవమున్న రమ్యకృష్ణ, ఈ సినిమాలో ఒక సీన్ కోసం 37 టేకులు తీసుకున్నారట. ఇప్పుడు ఈ విషయమే కోలీవుడ్లో హాట్ టాపిక్ గా మారింది. 'ఇది నా కెరియర్లోనే ఛాలెంజింగ్ రోల్ .. కొన్ని పాత్రలు పేరు కోసం .. కొన్ని పాత్రలు డబ్బుకోసం .. మరికొన్ని పాత్రలను ప్యాషన్ తో చేస్తాము .. అలా ప్యాషన్ తో చేసిన పాత్ర ఇది' అని రమ్యకృష్ణ చెప్పడం అందరిలో మరింత ఆసక్తిని పెంచుతోంది. కుమార రాజా దర్శకత్వం వహించిన ఈ సినిమాను, మార్చి 29వ తేదీన తమిళంతో పాటు తెలుగులోను విడుదల చేయనున్నారు.