ఇండస్ట్రీలో ప్లాస్టిక్ నవ్వులు ఎక్కువ: కమెడియన్ పృథ్వీ
- రఘుబాబుతో సాన్నిహిత్యం ఎక్కువ
- అభినందిస్తాడు - విమర్శిస్తాడు
- పబ్లిక్ ఫంక్షన్ లో ఆ మాట చెప్పాడు
అయితే, వీడు పైకి రావాలని కోరుకునేవాడు ఒకడుంటాడు. నా కెరియర్ కి సంబంధించినంత వరకూ ఆ ఒక్కడు .. రఘుబాబు. గిరిబాబుకి ఇద్దరు అబ్బాయిలు .. నేను మూడవవాడినని చెప్పుకుంటాను. రఘుబాబుతో నాకు అంతటి సాన్నిహిత్యం వుంది. ఏ పాత్రనైనా బాగా చేస్తే మెచ్చుకుంటాడు .. పాత్ర బాగోలేకపోతే 'ఎందుకు చేశావు భయ్యా' అంటాడు. 'లౌక్యం' సినిమాకి నాకు అవార్డు వచ్చినప్పుడు, 'నా కంటే మా అన్నయ్యకి వచ్చినందుకు ఆనందపడుతున్నాను' అని పబ్లిక్ ఫంక్షన్ లో చెప్పిన నిజమైన స్నేహితుడు రఘుబాబు" అని చెప్పుకొచ్చారు.