మళ్లీ విజయ్ దేవరకొండ జోడీ కడుతోన్న షాలినీ పాండే
- 'అర్జున్ రెడ్డి'తో షాలినీ పాండేకి క్రేజ్
- విజయ్ దేవరకొండతో ఆనంద్ అన్నామలై మూవీ
- స్పోర్ట్స్ నేపథ్యంలో సాగే కథ
ప్రస్తుతం విజయ్ దేవరకొండ 'డియర్ కామ్రేడ్' సినిమాను థియేటర్స్ కి తీసుకొచ్చే పనిలో వున్నాడు. ఇక క్రాంతిమాధవ్ సినిమాను కూడా చకచకా కానిచ్చేస్తున్నాడు. ఈ సినిమా తరువాత ఆయన తమిళ దర్శకుడు ఆనంద్ అన్నామలై తో సెట్స్ పైకి వెళ్లనున్నాడు. స్పోర్ట్స్ నేపథ్యంలో ఈ సినిమా సాగుతుంది. ఈ సినిమాలో కథానాయికగా షాలిని పాండేను తీసుకుంటున్నట్టుగా సమాచారం. ఈ ప్రాజెక్టుపై ఒక రేంజ్ లో అంచనాలు పెరగడానికి ఈ కాంబినేషన్ ఒక్కటి సరిపోతుందని చెప్పుకుంటున్నారు.