కమలహాసన్ పార్టీలో చేరిన సినీ హాస్య నటి కోవై సరళ!
- చెన్నైలో జరిగిన కార్యక్రమంలో ఎంఎన్ఎం తీర్థం
- కోవై సరళ సేవలు వినియోగించుకుంటామన్న కమల్
- పార్టీ విజయానికి కృషి చేస్తానన్న నటి
అనంతరం కమలహాసస్ స్పందిస్తూ.. కోవై సరళ సేవలు ప్రస్తుతం పార్టీకి అవసరమని అన్నారు. మక్కల్ నీది మయ్యం బలోపేతానికి ఆమె సహకారం తీసుకుంటామని తెలిపారు. కాగా, కోవై సరళ చేరిక నేపథ్యంలో కోయంబత్తూరు, కొంగునాడు ప్రాంతాల్లో పార్టీకి లబ్ధి చేకూరుతుందని ఎంఎన్ఎం వర్గాలు భావిస్తున్నాయి. కోవై సరళ-కమల్ జోడీగా నటించిన సతీలీలావతి సినిమా సూపర్ హిట్ గా నిలిచింది. తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం భాషల్లో 750కిపైగా సినిమాల్లో ఆమె నటించారు.