నాలుగు భాషల్లో రిలీజ్ కానున్న 'డియర్ కామ్రేడ్'
- ముగింపు దశలో 'డియర్ కామ్రేడ్'
- ఈ నెల 17న టీజర్ రిలీజ్
- మే 22వ తేదీన సినిమా విడుదల
విభిన్నమైన ప్రేమ కథాంశంతో నిర్మితమవుతోన్న ఈ సినిమాను, తెలుగుతో పాటు తమిళ .. మలయాళ .. కన్నడ భాషల్లో మే 22వ తేదీన భారీ స్థాయిలో విడుదల చేయనున్నారు. ఈ కారణంగానే టీజర్ ను ఈ నాలుగు భాషల్లో విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. టీజర్ రిలీజ్ కి ఈ నెల 17వ తేదీని ముహూర్తంగా నిర్ణయించారు. మైత్రీ మూవీ మేకర్స్ వారు నిర్మిస్తోన్న ఈ సినిమాలో, మెడికల్ స్టూడెంట్ గా విజయ్ దేవరకొండ .. క్రికెటర్ గా రష్మిక మందన కనిపించనున్నారు.