‘సేవా మిత్ర’లో తెలంగాణ వ్యక్తుల డేటా కూడా ఉంది: సిట్ ఇన్ ఛార్జి స్టీఫెన్ రవీంద్ర
- ఈ డేటా ఎందుకుందన్న దానిపై దర్యాప్తు చేస్తున్నాం
- ఐటీ గ్రిడ్స్ సంస్థ ఎండీ అశోక్ కోసం గాలిస్తున్నాం
- నిందితులు అమెరికాలో ఉన్నా, అమరావతిలో ఉన్నా కూడా పట్టుకుంటాం
డేటా ఎక్కడి నుంచి వచ్చింది? ఎవరు ఇచ్చారు? అనే దానిపై దృష్టి పెట్టామని, ఐటీ గ్రిడ్స్ సంస్థ ఎండీ అశోక్ పట్టుబడితే అన్ని విషయాలు బయటకొస్తాయని అన్నారు. అశోక్ కోసం గాలిస్తున్నామని, ఈ కేసులో నిందితులు అమెరికాలో ఉన్నా, అమరావతిలో ఉన్నా కూడా పట్టుకుంటామని చెప్పారు. అమెజాన్, గూగుల్ సంస్థల నుంచి సమాధానాలు రావాల్సి ఉన్నాయని స్టీఫెన్ రవీంద్ర అన్నారు.