'రుద్రవీణ'వలన పేరు వచ్చింది గానీ .. డబ్బులు పోయాయి: నాగబాబు
- శంకరాభరణం' హిట్ అయింది
- అలాంటి సినిమా చేయాలనుకున్నాం
- 'రుద్రవీణ' పరాజయం పాలైంది
బాలచందర్ గారితో మాట్లాడి 'రుద్రవీణ' సినిమాను తీశాము. ప్రేక్షకుల ముందుకు రావడానికి ఒకటిన్నర ఏడాది పట్టింది. అప్పట్లో ఒక్క రోజులోనే ఇళయరాజా గారు అన్ని పాటలకు ట్యూన్స్ చేసేశారు. అప్పట్లో 85 .. 90 లక్షల వరకూ బడ్జెట్ అయింది. సినిమా పరాజయంపాలు కావడంతో బాధపడ్డాము. ఆ సినిమా మంచి పేరు తెచ్చినా, ఇప్పుడు అలాంటి కథతో ఎవరైనా వచ్చినా సాహసం చేయలేము. పేరుకి నిర్మాతను నేనే అయినా .. డబ్బులు అన్నయ్యవి. ఈ సినిమాకి గాను ఆయన ఓ 10 .. 15లక్షలు నష్టపోయాడు" అని చెప్పుకొచ్చారు.