'జానకీదేవి'గా కనిపించనున్న సమంత
- తమిళంలో హిట్ కొట్టిన '96'
- తెలుగు టైటిల్ పై పూర్తయిన కసరత్తు
- ఏప్రిల్ నుంచి షూటింగ్ మొదలు
ఈ సినిమా కోసం 'జాను' .. 'జాను అలియాస్ జానకి' అనే రెండు పేర్లను పరిశీలించారు. తాజాగా 'జానకీదేవి' అనే టైటిల్ ను రిజిస్టర్ చేయించారట. దాదాపు ఇదే టైటిల్ ను ఖరారు చేయవచ్చనే టాక్ వినిపిస్తోంది. ఈ నెల 6వ తేదీన శర్వానంద్ పుట్టినరోజు .. ఆ రోజున టైటిల్ లోగోను రిలీజ్ చేయడం జరగొచ్చని చెప్పుకుంటున్నారు. ఏప్రిల్లో ఈ సినిమాను సెట్స్ పైకి తీసుకెళ్లే దిశగా పనులు జరుగుతున్నాయి.